15 April, 2026 | 1:16 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అంతర్జాతీయ వయో వృద్ధుల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

12-11-2025 08:31 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జరుగుచున్న ఈ నెల 12వ తారీఖు నుండి 19 వరకు జరుగుతున్న అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వారోత్సవాలలో భాగంగా బుధవారం అడిషనల్ కలెక్టర్ విద్యా చందన(లోకల్ బాడీస్), జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లేనినా ఆధ్వర్యంలో సంయుక్తంగా పోస్టర్  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, స్వచ్ఛంద సంస్థలు ఈ వారోత్సవాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లేనినా మాట్లాడుతూ నేటి సమాజంలో వృద్ధులు ఆదరణకు నోచుకోవడం లేదని, కొంతమంది కుటుంబ సభ్యులు వృద్ధులను పోషణ బాధ్యతలు నిర్వహించకుండా వారిని హింసిస్తున్నారని, వయో వృద్ధులకు ఉన్న చట్టం, హక్కును అందరికీ తెలిసేలా ఈ వారం రోజులు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  జిల్లా విద్యా శాఖ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సైదులు, సీనియర్ సిటిజన్స్ సభ్యులు నాగేశ్వర రావు, సందీప్, బ్రహ్మ కుమారి మహేశ్వరి, సిడిపివోలు పద్మ, లక్ష్మీ ప్రసన్న, కార్యాలయ సిబ్బంది వర ప్రసాద్, నరేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.