వరి కొనుగోలు కేంద్రాలు నమ్మకంగా పనిచేస్తున్నాయి
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్ నగర్ టౌన్,నవంబర్ 12: మహబూబ్ నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు.
కనీస మద్దతు ధర కు ప్రభుత్వం హామీ ఇస్తుందని, రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల ధాన్యాన్ని అనధికారంగా తక్కువ ధరకే కొనుగోలు చేయాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, అని ఎమ్మెల్యే హెచ్చరించారు. రైతులు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే మండల/జిల్లా అధికారులు లేదా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వైఎస్సార్ కిట్ అందజేస్తాం
మహబూబ్ నగర్, నవంబర్ 12 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేసే మహిళలకు వైఎస్సార్ కిట్ను అందజేస్తామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆశా కార్యకర్తలకు యూనిఫాం (చీరలు) లను ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు ప్రజా ఆరోగ్య రంగంలో పోరాట సైనికులుగా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. నవంబర్ 14వ తేదీ నుండి ప్రభుత్వ దవాఖానలో ప్రసవం అయ్యే తల్లులకు వైఎస్సార్ కిట్ అందజేస్తామని స్పష్టం చేశారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంచార్జీ గోనెల శ్రీనివాసులు, ఐఎన్టీయుసి రాములు యాదవ్, అంజద్ , అశ్వాక్ , చర్ల శ్రీనివాసులు, మోయీజ్, వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




