calender_icon.png 13 November, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో చేప పిల్లలను వదిలిన మంత్రి జూపల్లి కృష్ణారావు

13-11-2025 12:37:45 AM

కొల్లాపూర్ రూరల్, నవంబర్ 12 : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని  పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం జిల్లాలోని  సోమశిల వద్ద శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణ నదిలో లక్ష చేప పిల్లలను వదిలారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులకు అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా బలోపేతం  చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

వంద శాతం సబ్సిడీతో మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 2.50 కోట్ల చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు చేశామని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ చేప పిల్లలను పంపిణీ చేశారు. వారితోపాటు సెంట్రల్ జైంట్ సెక్రెటరీ నీతు ప్రసాద్ , మత్స్య శాఖ కమిషనర్ నిఖిల రెడ్డి,జిల్లా మత్స్యశాఖ అధికారిని రజిని ఉన్నారు.

లాంచీలో శ్రీశైలం వెళ్ళే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించండి

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల సోమశిల నుంచి శ్రీశైలం వెళ్లే క్రూయిజ్  లాంచ్‌ని బుధవారం మంత్రి జూపల్లి కృష్ణా రావు సందర్శించారు, శ్రీశైలం వెళ్లే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలని, నిత్యం శ్రీశైలానికి లాంచిని నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పార్టీ నాయ కులు బచ్చలకూర బాలరాజు, సోమశిల మాజీ సర్పంచ్ బింగి మద్దిలేటి, రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ ధర్మతేజ తదితరులు పాల్గొన్నారు,