13-11-2025 12:34:32 AM
కలెక్టర్ బి. ఎం. సంతోష్
అలంపూర్, నవంబర్ 12: సీసీఐ నిబంధనల ప్రకారం రైతులు పత్తి ఆరబెట్టుకుని వచ్చేలా సంబంధిత ఏఈఓ లు అవగాహన కల్పిస్తే, రైతులు నష్టపోకుండా పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. బుధవారం అలంపూర్ చౌరస్తా సమీపంలో ఉన్న వరసిద్ధి వినాయక జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.
సీసీఐ నిబంధనల ప్రకారం 8 నుంచి 12% లోపు తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేస్తున్నందున రైతులు దాని ప్రకారం ఆరబెట్టుకుని తీసుకురావాలని సూచించారు. ఈ పర్యటనలో జిల్లా మార్కెటింగ్ అధికారిని పుష్పమ్మ, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్, సిసిఐ అధికారి రాహుల్ కలాన, తదితరులు ఉన్నారు.