హండ్రెడ్ టోర్నీలో రిఛా ఘోష్ మెరుపులు
25-07-2026 02:07 AM
లండన్, జూలై 24: హండ్రెడ్ క్రికెట్ టో ర్నీలో భారత మహిళా బ్యాటర్లు అదరగొడుతున్నారు. భారత వికెట్‌కీపర్ రిచా ఘోష్ రెండు భారీ సిక్సర్లతో తన జట్టును గెలిపించడం హైలైట్‌గా నిలిచింది. మాంచెస్టర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రిఛా లండన్ స్పిరిట్ వుమెన్‌తో మ్యాచ్‌లో సత్తా చాటింది. మొ దట బ్యాటింగ్‌కు దిగిన లండ న్ స్పిరిట్ 80 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ చార్లెట్ డీన్ (14), చారిస్ పవెలి (13) పర్వాలేదనిపించా రు. మాంచెస్టర్ బౌలర్లలో రియానా మెక్డొనాల్ 4 వికెట్లతో సత్తా చాటింది. 81 పరుగు ల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ వు మెన్ కు ఓపెనర్లు స్మృతి మంధాన 17 (3 ఫోర్లు), మెగ్ లానింగ్ (21) మం చి ఆరంభా న్నే ఇచ్చారు. తర్వాత రిఛా ఘోష్ భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించింది.






