సెమీఫైనల్లో శ్రీహరి నటరాజ్
హీట్స్‌లో అదరగొట్టిన భారత స్మిమ్మర్
పారా స్విమ్మింగ్‌లోనూ భారత్ జోరు
ఫైనల్లో బుడిగినా, ఇమామ్ అలీ
గ్లాస్గో, జూలై 24: కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ అదరగొట్టాడు. మెడల్ అంచనాలతో బరిలోకి దిగిన ఈ యువ స్మిమ్మర్ పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన హీ ట్స్‌లో శ్రీహరి 25.52 సెకన్లలో రేసును పూర్తి చేసి సంయుక్తంగా 14వ స్థానంలో నిలిచాడు. బెర్ముడాకు చెందిన జాక్ హార్వేతో స మాన సమయాన్ని నమోదు చేసిన నటరాజ్.. టాప్-16లో చోటు దక్కించుకుని సెమీ స్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు.
ఎనిమిది మంది పాల్గొన్న ఈ హీట్‌లో శ్రీహరి ఐదో స్థానంలో నిలిచాడు. రెండు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఈ భారత స్విమ్మర్.. ఇప్పటికే పలు జాతీయ రికార్డులు సాధించాడు. మరోవైపు పారా స్విమ్మింగ్‌లోనూ భారత్ అదరగొట్టిం ది. 100 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్13 విభాగంలో భారత క్రీడాకారులు ఆర్వీవీబీకే బుడిగినా, ఇమామ్ అలీ ఫైనల్లో అడుగుపెట్టారు. బుడిగినా 57.10 సెకన్ల టైమింగ్‌తో హీట్స్‌లో మూడో స్థానంలో నిలవగా.. ఇమామ్ అలీ 1:05.32 సెకన్లతో చివరి స్థానంలో ఉన్నా డు. దృష్టిలోపం ఉన్న అథ్లెట్ల కోసం నిర్వహించే పారా స్విమ్మింగ్ కేటగిరీని ఎస్13గా పిలుస్తారు.






