25 July, 2026 | 2:39 AM

చాంపియన్స్‌గా శృంగేరిరాయ్, రవికుమార్

25-07-2026 02:09 AM

హైదరాబాద్ , జూలై 24: జీఎంఆర్ స్పోర్ట్స్ 6వ సికింద్రాబాద్ క్లబ్ యూత్ ఓపెన్ రెగట్టాలో ఆప్టిమిస్ట్ టైటిళ్లను శృంగేరిరాయ్, రవికుమార్ కైవసం చేసుకున్నారు. ఈ పోటీ ల ఆరంభం నుంచీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న వీరిద్దరూ తుది పోరులోనూ సత్తా చాటారు. సికింద్రాబాద్ క్లబ్‌కు చెందిన శృంగేరిరాయ్‌కు ప్రత్యర్థుల నుంచి పెట్టగా పోటీ ఎదురుకాలేదు. ఆప్టిమిస్ట్ మెయిన్ ఫ్లీట్ బాలికల విభాగంలో ఆమె అగ్రస్థానం లో నిలవగా, షేక్ రమీజా బాను రెండో స్థానంలోనూ, సృష్టి సింగ్ మూడో స్థానంలోనూ నిలిచారు.

ఆప్టిమిస్ట్ మెయిన్ ఫ్లీట్ బాలుర విభాగంలో రవికుమార్ టాప్ ప్లేస్ సాధించగా, ఇల్జాని మహ్మద్ (మలేషియా) రెండో స్థానంలోనూ, ఆంటోనీ మూడో స్థా నంలోనూ నిలిచారు. ఆప్టిమిస్ట్ గ్రీన్ ఫ్లీట్ బా లుర విభాగంలో యువరాజ్ సిరోహీ, ఆదిత్య, సామ్రాట్ వరుసగా తొలి మూడు స్థానాలను సాధించారు. అటు బాలికల విభాగంలో నేతికోపుల సింధు అగ్రస్థానం నిలవగా, ఆన్యా రెడ్డి, రోషిణి రెండు, మూడు స్థానాల్లోనూ నిలిచారు. ఐఎల్ సీఏ 6 బాలు ర కేటగిరీలో అమర్ జైస్వాల్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. బాలికల విభాగంలో శీతల్ సెంధవ్ అగ్రస్థానంలో నిలిచింది. జాతీయ జూనియర్ ర్యాంకింగ్ టోర్నీ కావడంతో నేషనల్ సెలక్షన్స్‌కు ఈ పోటీలు కీలకం కానున్నాయి.