సమాచార హక్కు చట్టం బోర్డు మార్పు
మణుగూరు, సెప్టెంబర్ 16, (విజ యక్రాంతి) : మండల విద్యాశాఖ కార్యాలయంలో పాత అధికారుల పేరుతోనే సమాచార హక్కు చట్టం బోర్డు ఉండడంతో పౌర సమాచారం కోసం ప్రజలు, సమాచార హక్కు చట్టం కార్యకర్తలు, సామాజిక సేవకులు పడుతున్న ఇబ్బందులఫై విజయక్రాంతి లో అధికారులు మారిన మారని సమాచార బోర్డు అనే శీర్షిక ప్రచోత్తమైంది. కథనానికి మండల విద్యా శాఖ అధికారి నాగజ్యోతి స్పందించారు.
మంగళవారం విద్యాశాఖ కార్యాలయ ఆవరణంలో పౌర సమాచార అధికారి, సహాయ పౌర సమాచార అ ధికారి పేర్లు, హోదా, మొబైల్ నెంబర్లు స్పష్టంగా కనిపించే విదంగా నూతన బోర్డును ఏర్పాటు చేశారు. సమాచార హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధం లాంటిదని ప్రతి ఒక్కరు ఈ సమాచార హక్కుచట్టం పై అవగాహన పెంచుకొని అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వ శాఖలు , సంస్థల నుండి పొందవచ్చు అని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు బోర్డు ఏర్పాటు పట్ల సామాజిక, ఆర్టిఏ కార్యకర్తలు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.






