17-09-2025 12:15:20 AM
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 16 ( విజయ క్రాంతి): స్లాట్ బుక్ చేసుకొని క్రయవిక్రయ దారులు ఎదురుచూపులు. *ప్రజావాణి దరఖాస్తులు పరిష్కారం లేదు.దరఖాస్తులు ఇచ్చేందుకు ఆఫీస్ ముందు ప్రజలు పడిగాపులు. సమయపాలన పాటించకుండా ఆఫీస్ విధులకు హాజరవుతున్న ఎర్రుపాలెం తాసిల్దార్ పై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దివ్వెల వీరయ్య , మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎర్రుపాలెం తహసిల్దార్ కార్యాలయం నందు భూముల క్రయ విక్రయదారుల రైతు లు స్లాట్ బుక్ చేసుకొని భూముల రిజిస్ట్రేషన్ కోసం వచ్చి చెట్ల కింద త హసిల్దార్ రాక కోసం గంటలతరబడి పడిగాపులు కాస్తున్నారని ఎప్పుడు వస్తారో ?ఎప్పుడు వెళ్తారో తెలియ టం లేదని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు విమ ర్శించారు.ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఎర్రుపాలెంమం డల తహసిల్దార్ సమయ పాలనపా టించకుండా ప్రతిరోజు ఆలస్యంగా కార్యాలయానికి వస్తున్నారని ప్రజల ను పలు ఇబ్బందులు పెడుతున్నా రని విమర్శించారు.
అసలు ఈ రోజు కార్యాలయానికి వస్తుంరా? రారా అ నే సమాచారం కూడా ఉండటం లేద ని అక్కడ సమాచారం చెప్పే వాళ్ళు కూడా లేరని మంగళవారం మధ్యా హ్నం వరకు కార్యాలయానికి రాలే దని అన్నారు.వృద్ధులు కూడా వచ్చి తాసిల్దార్ కోసం చెట్ల క్రింద తిష్ట వే సుకొని కూర్చోవాల్సి వస్తుందని రై తులు తెలిపారని అన్నారు.ప్రజా స మస్యలు పరిష్కరించడంలో తాత్ప ర్యం చేస్తున్నారని విమర్శించారు.
10 గంటల సమయానికి వచ్చిన రై తులు ప్రజలు ఆకలి దప్పికలతో అ ల్లాడిపోతున్నారని సమయపాలన పాటించకుండా తన ఇష్టం వచ్చిన సమయానికి వస్తున్నారని ప్రజలను రైతులను పలు ఇబ్బందులు పెడు తున్నారని తెలిపారు.సమయపాలన పాటించకుండా ప్రజ లను రైతులను పలు ఇబ్బందులు పెడుతున్న తాసిల్దార్ పై ఉన్నతాధి కారులు చర్యలు చేపట్టాలనిడిమాం డ్ చేశారు.