27 July, 2026 | 6:56 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చి అన్ని హక్కులు కల్పించాలి

13-04-2026 04:47 PM

వేములపల్లి,(విజయక్రాంతి): అసైన్డ్ భూముల కు పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించాలని టిఆర్ఎస్ జిల్లా నాయకుడు కట్ట మల్లేష్ గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ ఆఫీస్ కి శెట్టిపాలెం ముళ్లపాడు ఇటిక్యాల ప్రజలతో కలిసి ర్యాలీగా వచ్చి తాసిల్దార్ హేమలత కి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి రాకముందు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే అసైన్డ్ భూములకు పట్టాలు కల్పించి అన్ని హక్కులను కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 28 నెలలు గడిచినప్పటికీ వాటి పట్టాల గురించి ఊసే ఎత్తడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పేదరైతుల పట్లచిత్తశుద్ధి ఉంటే వెంటనే పట్టాలు ఇప్పించి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేదలకే అసైన్డ్ భూములు ఉన్నాయన్నారు. ఈ భూములను పంట పొలాలుగా మార్చి పంట పండించుకోవడానికి తప్ప వారి కుటుంబ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు లేకుండా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కొంతమంది నిరుపేదలు ఆడ బిడ్డలకు పసుపు కుంకుమ కింద భూమి ఇచ్చినప్పటికీ వారికి పట్టాలు కాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అసైన్డ్ భూములకు పట్టాలు కల్పించి హక్కులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెదపంగ సైదులు, మాజీ ఎంపీటీసీ మజ్జిగపు సుధాకర్ రెడ్డి  గోపాల్ రావు బంటు పిచ్చయ్య ఫకీరయ్య భిక్షం సుజాత సోవమ్మ శేఖర్ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు