అక్రమ రవాణా నిరోధం కోసం పటిష్టంగా వాహన తనిఖీలు
పోలీస్ అంటే ధైర్యం... ప్రజలకు భరోసా
సీఐ చరమంద రాజు
గరిడేపల్లి,(విజయక్రాంతి): అక్రమ రవాణా అసాంఘిక కార్యకలాపాలు అనుమానిత వ్యక్తుల కదలిక నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం తన కీలు నిర్వహిస్తున్నట్లు హుజూర్నగర్ సిఐ చరమందరాజు తెలిపారు.హుజూర్నగర్ సర్కిల్ పరిధిలోగల ఐదు పోలీస్ స్టేషన్లు నందు పోలీస్ కట్టడి ముట్టడిలో భాగంగా గరిడేపల్లి మండల కేంద్రంలో తనకీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.ప్రజలకు మెరుగైన సేవలు,భద్రత కల్పించడం లక్ష్యంగా బక్రీద్ పండగ సందర్భంగా గోవుల అక్రమ రవాణా నిరోధంలో భాగంగా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం మండల కేంద్రంలోని పొనుగోడు క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.తనిఖీలలో భాగంగా గోవుల అక్రమ రవాణా పేలుడు సామాగ్రి మారణాయుధాలు త్రిబుల్ రైడింగ్ మైనర్ డ్రైవింగ్ వితౌట్ ఎలిమెంట్ వితౌట్ లైసెన్స్ సీట్ బెల్ట్ ధరించని వాహనాల దారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి కట్టడి ముట్టడి కార్యక్రమంలో భాగంగా గరిడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు






