17 August, 2026 | 3:36 AM

థ్రిల్లింగ్ అంశాలతో అ

17-08-2026 01:36 AM

స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్ తొలిసారి ఓ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నాయి. కనకరావు తొనంగి, అభిషేక్‌లతో కలిసి ప్రముఖ ఎడిటర్- డైరెక్టర్ గ్యారీ బీహెచ్ నిర్మిస్తున్నారు. రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి బాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘అ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

నిర్మాతలు ఈ టైటిల్‌ను హీరో అడివి శేష్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కథానాయకుడు రాహుల్ విజయ్ చేతిలో లాఠీ పట్టుకుని కూర్చుని కనిపిస్తున్నారు. అతని బ్యాక్‌గ్రౌండ్‌లో చార్మినార్ కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ఈ థ్రిల్లర్ కథ హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుందని అర్థమవుతోంది. జాన్ విజయ్, సుదర్శన్, మిర్చి కిరణ్, బిత్తిరి సత్తి, దయానంద్‌రెడ్డి ఇతర ముఖ్యాపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.