17 August, 2026 | 2:11 AM

బహుశా ఇదే జీవితం కావచ్చు!

17-08-2026 01:38 AM

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఇటీవల ‘మైసా’ షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఆమె ఆరు వారాల విశ్రాంతిలో ఉన్నారు. ఈ ఊహించని విరామం వృత్తిపరమైన పని, వ్యక్తిగత జీవితంపై తన దృక్పథాన్ని ఎలా మార్చిందో ఆమె తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “క్షణం తీరిక లేకుండా నిరంతరం పనిచేస్తున్నప్పుడు, అకస్మాత్తుగా వేగాన్ని తగ్గించడం భయంగా అనిపిస్తుంది.

కానీ, అనుకోని పరిస్థితుల వల్ల నెమ్మదించాల్సి వచ్చినప్పుడు, గతంలో చేసిన ఆ తీవ్రమైన శ్రమ ఇప్పుడు భయాన్ని కలిగిస్తోంది. బహుశా ఇదే జీవితం కావచ్చు” అని రాసుకొచ్చారు రష్మిక. తన కుటుంబ సభ్యులతో గడుపుతున్న కొన్ని ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు. తాను ప్రస్తుతం ప్రేమ, సానుకూలత, ప్రార్థనల మధ్య ఉన్నానని చెబుతూ, అభిమానుల ఆదరాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.