16 April, 2026 | 8:03 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

నీట్ ఫలితాలలో రిషి ప్రభంజనం

15-06-2025 12:40 AM

100కు పైగా సీట్లు సాధించి విద్యార్థులను విజయతీరాలకు చేర్చిన రిషి కళాశాల...

విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించిన కళాశాల చైర్ పర్సన్ చంద్రకళ వెంకట్..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): నేటి ఫలితాలలో రుచి కళాశాల ప్రభంజనం సృష్టించింది. విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి వందకు పైగా మెడికల్ సీట్లు పొందుతున్నారని కళాశాల చైర్ పర్సన్ చంద్రకళ వెంకట్(College Chairperson Chandrakala Venkat), చీఫ్ అకాడమీక్ అడ్వైజర్ వెంకటయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా నీట్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు తరుణ్ సాయి 550, స్వర్ణకుమారి 545, వినయ్ 525 మెడికల్ సీట్లు సాధిస్తున్న విద్యార్థులను కళాశాల చైర్ పర్సన్ చంద్రకళ వెంకట్, చీఫ్ అకాడమీక్ అడ్వైజర్ వెంకటయ్య అభినందించారు. విద్యార్థులను విజయతీరాలకు చేర్చడంలో రిషి కళాశాల ప్రత్యేకంగా కృషి చేస్తుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ భూపాల్ రెడ్డి, అకాడమిక్ డీన్ లక్ష్మారెడ్డి, ప్రిన్సిపల్ ప్రసన్నకుమారి, రాఘవేంద్రరావు, అధ్యాపకులు అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.