18 July, 2026 | 1:53 PM

వర్షాల కోసం గ్రామదేవతలకు జలాభిషేకం

18-07-2026 01:53 PM

సుల్తానాబాద్ లో వర్షాల కోసం గ్రామదేవతలకు జలాభిషేకం 

పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు

సుల్తానాబాద్, జూలై 18 (విజయక్రాంతి): వరుణుడు  కరుణించిలని... వర్షాలు కురవాలని... పంటలు సమృద్ధిగా పండాలని... రైతులను చల్లంగా చూడాలంటూ.... శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మహిళలు పెద్ద ఎత్తున బిందెలతో నీళ్లు తీసుకువెళ్లి పోచమ్మ , రేణుక ఎల్లమ్మ తల్లి గ్రామ దేవతల కు జలాభిషేకం చేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత లు మాట్లాడుతూ  వర్షాకాలం ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడిచినప్పటికీ వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని,  వరుణుడు కరుణించి వర్షాలు కురిపించాలని కోరుతూ గ్రామదేవతల ను వేడుకోవడంజరిగిందన్నారు,నీళ్ల బిందెలను నెత్తిన ఎత్తుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవార్లకు మహిళలు జిలాభిషేకం చేశారు.వర్షాలు సంవృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని వాన దేవుడిని ప్రార్థించడం జరిగిందని వారు అన్నారు.