ఏటూరునాగారంలో రోడ్డు ప్రమాదం
17-09-2025 12:01 AM
ఏటూరునాగారం,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండల పరిధిలో 163 జాతీయ రహదారి 3వ బ్రిడ్జి వద్ద ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కన్నాయిగూడెం మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు కాళ్లు విరిగిపోయాయని స్థానికులు తెలిపారు. కాగా, మరో బైక్ పై ఉన్న వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయన్నారు. అనంతరం 108 అంబులెన్స్ సహాయంతో ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






