ప్రజాపంపిణీ వ్యవస్థ పక్కదారి?
- డీలర్ చనిపోయినా ఏళ్ల తరబడి ఇన్‌చార్జీలే
- అడిగినంత ఇచ్చుకో ఇన్‌చార్జీ పుచ్చుకో
- మామూళ్ల మత్తులో సివిల్ సప్లై అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ అధికారుల నిర్లక్ష్యం, ఆమ్యామ్యాలా కారణంగా పక్కదారి పడుతోంది. డీలర్ చనిపోయి సంవత్సరాలు గడుస్తున్నా నోటిఫికేషన్ ఇవ్వకుండా అడిగినంత పుచ్చుకొని అదనపు బాధ్యతలతో చౌకడిపో లను నిర్వహిస్తు న్నారు. ఫలితంగా వినియోగదారులకు అందాల్సిన నిత్యవసర సరుకులు అందకుండా నల్ల బజారుకు తరలుతున్నట్లు సర్వత్ర ఆరోపణలు వినబడుతున్నాయి.
నెల నెల నజరా నా పుచ్చుకొని డీలర్ల అక్రమాలకు సివిల్ స ప్లై అధికారులు సహకరిస్తున్నారనే విమర్శ లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 443 రేషన్ షాపుల ద్వారా నిరుపేదలకు బియ్యం సరఫరా జరుగుతుంది. వాటిలో సుమారు 10 నుంచి 15 శాతం వరకు ఇన్చార్జిల పాలనలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.డీలర్ చనిపోయిన, అక్రమాలకు పాల్పడి సస్పెండ్ అ యిన ఆ షాపును తాత్కాలికంగా ఇన్చార్జితో నిర్వహిస్తారు.
ఏ కారణం చేతనైనా డీలర్ చనిపోతే అతని కుటుంబ సభ్యులకు ఆ షాపును అప్పగించాల్సి ఉంటుంది, లేదా నోటిఫికేషన్ ద్వారా డీలర్ను ఎంపిక చేయాలని నిబంధనలు ఉన్నాయి. సివిల్ సప్లై అధికారులు వాటిని తుంగలో తొక్కి, కావలసినంత పుచ్చుకొని అనుకూలమైన డీలర్ కు అదన పు బాధ్యతలు ఇచ్చుకో అన్న చందాన సాగుతోంది. పాల్వంచ పట్టణంలో గల 44 దు కాణాలలో, నాలుగు నుంచి 6 దుకాణాలను ఇన్చార్జిల ద్వారా ఏళ్ల తరబడి నిర్వహిస్తున్నారు.
గాంధీ మృతి చెంది 10 సంవ త్సరాలు, నరసింహారావు మృతి చెంది 3 సంవత్సరాలు, పెండ్యాల రాంబాబు మృతి చెంది 4 సంవత్సరాలు గడుస్తున్న అధికారు లు వారి కుటుంబ సభ్యులకు కేటాయించకుండా అనుకూలమైన డీలర్లకు అదనపు బా ధ్యతలు లేచి నిర్వహిస్తున్నారు. వాస్తవంగా డీలర్ మరణించగానే కుటుంబ సభ్యులు ఎ వరూ ముందుకు రాకుంటే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది.
జగ్గుతం డా రేషన్ డీలర్ కే టి పి ఎస్ ఉద్యోగం వచ్చినప్పటికీ ఆ షాపును సైతం అదనపు బాధ్య తలతో బినామీలను ఏర్పాటు చేయడం ఆ రోపణ దృవ పరుస్తున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని దుకాణాలను బినామీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక షాపు కు మరొక షాపుకు సుమారు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం ఉండటంతో సద రు ఆ డీలరు రెండు షాపుల వినియోగదారులకు సరిపడా రేషన్ పంపిణీ చేయలేక పో తున్నారనీ తెలుస్తోంది.
దీంతో వినియోగదారులు రేషన్ అందక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. అంతటితో సరిపోకుండా వి నియోగదారుల నుంచి డీలరే నేరుగా కిలో బియ్యం రూ 13 నుంచి రూ 14 లకు కొనుగోలు చేసి నల్లబజారుకు తరలిస్తున్నట్లు ఆ రోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్న సి విల్ సప్లైడిప్యూటీ తాసిల్దార్లు చోద్యం చూ స్తున్నట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి.
పాటించని సమయపాలన నిత్యావసర సరుకుల పంపిణీ చేయాల్సిన డీలర్ షాపులు ఉ దయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గం టల వరకు షాపులు తెరిచి ఉంచాల్సి ఉం డగా, 80 శాతం షాపులు ఉదయం వేళల్లో తాళాలు దర్శనమిస్తుంటాయి. కేవలం సా యంత్రం వేళల్లో మాత్రమే షాపులు తెరిచి ఉంచుతున్నారు. అధికారులు మాత్రం ఈ విషయం తెలిసిన నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
నెల నెల నజరానా నిబంధ నలో పాటించకున్న, అక్రమాలకు పాల్పడిన అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడకుండా ఉండేందుకుప్రతి డీలరు అధికారుల కు నెల నెల 500 నుంచి 1000 రూపాయ ల వరకు నజరానా చెల్లించాల్సిందే. లేకుం టే తనిఖీలు, దాడులు, మెమోలు చవి చూడాల్సి ఉంటుంది. అందుకే ప్రతి డీలర్ నెలకు అధికారులకు నజరానా చెల్లించాల్సి వస్తోందనీ తెలుస్తోంది.
ఒక్క పాల్వంచ ప ట్టణం లోనే నెలకు రూ 30 నుంచి రూ 40 వేల వరకు వసూలు చేస్తున్నారంటే జి ల్లా వ్యాప్తంగా ఏ మేరకు వసూలు కొనసాగుతున్నాయో ఇట్టే చెప్పవచ్చు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దృష్టి సారించాలని, రేషన్ షాపులో జరుగుతున్న అక్రమాలపై నిఘా ఏర్పాటు చే యాలని, తద్వారా నిరుపేదలకు రాయితీపై అందే బియ్యం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
బినామీ డీలర్లు, నెల నెల నజరానా, ఇంచార్జి పాలనలపై పాల్వంచ డిప్యూటీ తాసిల్దార్ సివిల్ సప్లై శ్రీనివాసులు వివరణ కోర గా నోటిఫికేషన్ జారీ చేయాల్సింది ఆర్డిఓ అ న్నారు. ప్రతి మండలం నుంచి షాపుల వివరాలను డీలర్ల పేర్లను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తుంటామన్నారు. ఖాళీగా ఉన్న డీలర్ షాపులను ఆర్డీవోనే నోటిఫికేషన్ ద్వా రా భర్తీ చేయాల్సి ఉంటుందన్నారు. నెల నె ల నజరానా అనేది అవాస్తవం అన్నారు.






