వనపర్తిలో ఘోర రోడ్డుప్రమాదం.. సాధువులపై దూసుకెళ్లిన డీసీఎం
09-06-2024 12:58 PM
వనపర్తి, విజయక్రాంతి : వనపర్తి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన డీసీఎం సాధువులపై దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు సాధువులు మృతి చెందారు. ఈ సంఘటన వననపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గుజరాత్ కు చెందిన సాధువులు పెబ్బేరు నుంచి కర్నూలు వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన డీసీఎం అదుపుతప్పి సాధువులను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడగా,, మరొకరు చికిత్స పొందుతూ చనిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.






