నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
కోదాడ ఏప్రిల్ 16,రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం మునగాల మండల పరిది ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాల, కోదాడ మండలం అల్వా లపురం రైతు వేదికలో ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్ర మాదాలపై అవగాహనా, సంక్షేమ పథకాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు పాటించకుండ నిర్లక్ష్యంగా వాహనాలు నడపటం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదం లో ఎక్కువ మంది మద్యం సేవించి రోడ్డు ప్రమాదాలకు గురై మృతి చెందిన వారే ఉన్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపటంతో రోడ్డు ప్రమాదంలో గాయాలై ఆసుపత్రి పాలై మృతి చెందడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నట్లు తెలిపారు. చిన్న తప్పు పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందన్నారు. గ్రామాల్లో శానిటేషన్, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అధికారులు, ప్రజాప్రతినిధులు వివరించాలని కోరారు. విద్య, వైద్యం విషయంలో ఎలాంటి అలసత్వం ఉండొద్దన్నారు. విద్యార్థులచే రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు, పాఠశాల బస్సు డ్రైవర్లకు, ఉపాధ్యాయులకు, పాత్రికేయులకు హెల్మెట్లు అందించారు. అనంతరం కలెక్టర్ కోదాడ ప్రభుత్వాస్పత్రిని పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్ని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, ఆర్డీఓ సూర్యనా రాయణ, తహశీ ల్దార్ వాజిద్ అలీ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలానీ, మునగాల సర్కి ల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ ప్రవీణ్, ఎస్‌ఐ అజ య్, రూరల్ ఎస్త్స్ర గోపాల్ రెడ్డి, ఎంఈఓ సలీం షరీఫ్, ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్, స్కూల్ డైరెక్టర్ వెంకటేశ్వర రావు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.






