17 April, 2026 | 2:17 AM

సమస్యలు పరిష్కరించాలి

17-04-2026 12:36 AM

తొమ్మిదో రోజుకు చేరిన విద్యుత్ కార్మికుల సమ్మె

మహబూబాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ఉద్యోగ క్రమబద్ధీకరణ, ఏకీకృత సర్వీసు రూల్, వేతన పెంపు తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం తొమ్మిదో రోజుకు చేరింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు తొర్రూరు డివిజన్ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జా యింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా ఆర్టిజన్, అనుమ్యాన్, స్పాట్ బిల్లర్స్, పీస్ రేట్ వర్క ర్స్ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

జిల్లా కన్వీనర్ పెద్ది భాస్కర్, జిల్లా చైర్మన్ కోల గంగరాజు, తొర్రూర్ డివిజన్ జాక్ చైర్మన్ పసుపులేటి మధు మాట్లాడుతూ యాజమాన్యం ఎలాంటి నోటీసు ఇ చ్చినా భయపడొద్దని, సమ్మె ముందస్తుగానే సమాచారం ఇచ్చామని లేబర్ కమిషనర్ 17 చర్చలకు పిలిచారని, ఈ సమయంలో ఎ లాంటి నోటీసులు ఇచ్చినా చెల్లవన్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ మచ్చ సతీష్, డివిజన్ కన్వీనర్ బంధా రపు శ్రీను, కో చైర్మన్ నాగరాజు, కో కన్వీనర్ రమేష్ ఖాజాబీ, సునీల్ కుమార్, ఉపేందర్, చంద్రప్రకాష్, జ్యోతి, సంధ్య, సుభాష్, హరిప్రసాద్, శంకర్, బిక్కు, బిచ్చనాయక్,అశోక్, సందీప్, రవికాంత్, ప్రశాంత్, నారాయణ, రవి, నవీన్, సురేష్, పాషా, రామకృష్ణ, రజనీకాంత్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.