23 May, 2026 | 5:17 PM

నక్ష బాట ప్రకారం రోడ్డు నిర్మాణం చేపట్టాలి

23-05-2026 04:45 PM

మాడ్గుల,(విజయక్రాంతి):  నక్ష బాట ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా రోడ్డు నిర్మాణ పనులు చేపడితే ఊరుకునేది లేదని కలకొండ గ్రామానికి చెందిన రైతులు హెచ్చరించారు. శనివారం మాడ్గుల మండల కేంద్రంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కలకొండ గ్రామ సమీపంలోని 303 సర్వే నెంబర్  లో 5 ఎకరాల 30 గుంటల భూమి ఉండగా కలకొండ నుంచి శనగల గుట్ట తండా వరకు వీటి రోడ్డు మంజూరు అయ్యింది.

నక్ష బాట ప్రకారం రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉండగా సంబంధిత కాంట్రాక్టర్ తమ పట్టా పొలం నుండి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని రైతులు వాపోయారు. రోడ్డు నిర్మాణం కోసం ఎలాంటి సర్వే చేయలేదని రాజకీయ ఒత్తిడితోనే తమ పొలాల నుండి బీటీ రోడ్డు నిర్మిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల నిరుపేద కుటుంబానికి చెందిన వారు తీవ్రంగా నష్టపోతున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమగ్ర సర్వే చేసే వరకు రోడ్డు నిర్మాణ పనులను నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో రైతులు హుస్సేన్, పెద్దయ్య,రాములు, అంజయ్య, నారయ్య, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.