23 May, 2026 | 5:21 PM

సాగు ఖర్చు తగ్గించుకుంటేనే లాభాలు

23-05-2026 04:48 PM

వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ బలరాం 

ఆమనగల్లు,(విజయక్రాంతి): ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో' రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమాన్ని శనివారం ఆమనగల్లు రైతు వేదిక లో నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ బలరాం మాట్లాడుతూ పంట మార్పిడి ద్వారానే రైతులకు అధిక నికరాదాయం పొందగలరని వివరించారు. వ్యవసాయంలో రసాయనిక పురుగుమందుల వాడకం తగ్గించి, సేంద్రీయ పద్ధతిలో సాగు చేయాలని తద్వారా నాణ్యమైన పంట దిగుబడులను మరియు అధిక మార్కెట్ ధరలు పొందాలని సూచించారు.

పచ్చి రొట్టె పైర్లు, జీవన ఎరువుల వినియోగం పెంచుకొని యూరియా వాడకాన్ని తగ్గించాలని తద్వారా చీడపీడల ఉధృతిని తగ్గించుకోవచ్చని, భూసార పరిరక్షణ, వాతావరణ కాలుష్యనివారణ సాధ్యమవుతుందని వివరించారు. పత్తి పంటను ఎక్కువ రోజులు చేను మీద ఉంచకుండా పత్తి కట్టలను నేల లో కలియదున్ను కొని ఇతర ఆరుతడి పంటలైన మొక్కజొన్న, నువ్వులు సాగు చేసుకోవాలన్నారు. వరి పంటలో సిఫారసు చేసిన సన్నగింజ రకాలు తెలంగాణ సోనా KNM1638, WGL 962 వంటి అధిక దిగుబడినట్లు చీడపీడలు తట్టుకునే రకాలు సాగు చేసుకోవాలని నేరుగా వెదజల్లే విధానం మరియు ఆరుతడి పద్ధతిలో సాగు వంటి మేలైన యాజమాన్య విధానాలు పాటించాలని తెలిపారు.