23 May, 2026 | 5:39 PM

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

23-05-2026 05:04 PM

- అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలని, చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శని వారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీలో గల మంచిర్యాల క్లబ్ లో స్టార్ మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు, సెలక్షన్స్ కు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో పాల్గొనడం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడలను ప్రోత్సహిస్తున్న అందరిని అభినందించారు. క్రీడలలో రాణించిన వారికి మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఇందులో విన్నర్స్, రన్నర్స్ గా నిలిచిన వారిని రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు పంపించడం జరుగుతుందని బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్, ఉపాధ్యక్షుడు బండ మీనారెడ్డి తెలిపారు.