23 May, 2026 | 5:39 PM

ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిని సన్మానించిన మాల సంఘం సభ్యులు

23-05-2026 05:07 PM

బోథ్,(విజయక్రాంతి): ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించబడ్డ కురుమే మహేందర్ ను శనివారం నేరడిగొండలో మాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాల సంఘం నాయకులు మాట్లాడుతూ క్రమశిక్షణతో పార్టీ కోసం పని చేసిన మహేందర్ ను గుర్తించి రాష్ట్రస్థాయి పదవి కట్టబడటం హర్షనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మాట్లాడుతూ... తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు కర్ణంపల్లి సత్యనారాయణ కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాపూరావు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వాడే గజేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణస్వామి ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పడేళ్లు రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ కన్వీనర్ అనుభట్ల సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.