కోట్ పల్లిలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
23-05-2026 04:54 PM
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండల కేంద్రంలో శనివారం సామూహిక హనుమాన్ చాలీసా చేశారు. స్థానిక శ్రీ హనుమాన్ దేవాలయంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పారాయణం చేశారు. అనంతరం స్వామివారికి హారతి నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు, చిన్నారులు భారీగా పాల్గొన్నారు.






