12 March, 2026 | 5:05 PM

రోడ్డు డ్రైనేజీ ఏర్పాటు చేయాలి

12-03-2026 02:57 PM

కార్పొరేటర్ మేయర్ ను కోరిన 47వ డివిజన్ ప్రజలు. 

పాల్వంచ, (విజయక్రాంతి): ప్రజా పాలన సందర్భంగా  -99 డేస్  యాక్షన్ ప్లాన్ సందర్భంగా  భద్రాద్రికొత్తగూడెం మున్సిపల్(Bhadradri Kothagudem Municipal) మేయర్ మోడ్ గణేష్ డిప్యూటీ మేయర్  సిరిపురపు లలిత కుమారి, 47 వ డివిజన్ కార్పొరేటర్ గుర్రం  వెంకటేశ్వర్లు (జివిఆర్)  పాత పాల్వంచ లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి  సమస్యలను అడిగి తెలుసు కొన్నారు.  త్వరలో సమస్యను పరిష్కరిస్తామని  హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షాంబాగ్ చైర్మెన్ షేక్.రెహమాన్, కార్యదశి షేక్ గౌస్ పాషా, మొహమ్మద్ మస్తాన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.