12 March, 2026 | 4:35 PM

ఇల్లెందులో దొంగలు హల్ చల్

12-03-2026 02:59 PM

ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లెందులో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. ఇల్లందులో ఒకే రోజు రెండు ఇళ్లలో చోరీకి తెగబడ్డారు. తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి తెగబడ్డారు. సుభాష్ నగర్ లో సరికొండ గోపయ్య ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాను బద్దలు కొట్టి ఆరు తులాల బంగారం 15 తులాల వెండి రూ.20 వేల నగదును బాధితులు పేర్కొన్నారు.

అదేవిధంగా సంజయ్ నగర్ లోని రామాలయం పక్కన జానీ మియా ఇంట్లో సైతం బంగారాన్ని ఎత్తుకెళ్లారు. వరుస చోరీలతో పట్టణంలోని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పగలు దొంగలు రెక్కీలు నిర్వహిస్తూ తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చోరీల విషయం తెలుసుకున్న పోలీసులు కేసునమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రజలను అప్రమత్తంగా ఉందాలని అన్నారు. బస్తీలలో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.