46వ డివిజన్ లో పారిశుద్ధ్య పనులు
12-03-2026 02:55 PM
పర్యవేక్షించిన కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి*
పాల్వంచ, (విజయాక్రాంతి): తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలనలోభాగంగా 46వ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి పర్యటించి పారిశుద్ధ కార్యక్రమాలను పర్యవేక్షించారు. డ్రైనేజి క్లీనింగ్, విద్యుద్దీకరణ పనులు నిర్వహించారు. గడియకట్ట, నాయుడుపేట, బొడ్రాయి నుండి వేంకటేశ్వరస్వామి గుడి వరకు డ్రైనేజి క్లీనింగ్ పనులు, గడియకట్టలో విద్యుద్దీకరణ ఏర్పాటు చేశారు.




