27 June, 2026 | 2:35 AM

దారికొచ్చేదెప్పుడు..?

27-06-2026 01:42 AM

విజయక్రాంతి ఫోకస్ 

అధ్వానంగా మారిన రహదారి

చందుర్తి జూన్ 26 (విజయక్రాంతి): చందుర్తి మండలంలోని సనుగుల గ్రామం నుండి జలపతి తండా దేవుని తండా వరకు రెండు మండలాలను అనుసంధానం చేసే ఆర్ అండ్ బి రోడ్డు పూర్తిగా దెబ్బతింది, ఈ రోడ్డుని పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని, దశాబ్ద కాలం నాడు ఈ రోడ్డును వేశారని ఇప్పుడు పూర్తిగా అద్వాన్నంగా మారిందని, అప్పటినుండి ఇప్పటివరకు ఈ రోడ్డును పట్టించుకునే వారేలేరని స్థానికులు చెబుతున్నారు.

వర్షాకాలంలో ఈ రోడ్డుపై గుంతలు ఏర్పడి ఎన్నో ప్రమాదాలు జరిగాయని, ప్రమాదాలు జరిగినా కూడా ఇటువైపు కన్నెత్తి చూడని అధికారులు ఉన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. చందుర్తి మండలంలో మారుమూల గ్రామం, మండలానికి చివరలో ఉండడంతో అధికారులు ఇటువైపు వచ్చేవారే కరువయ్యారని చెబుతున్నారు, వెంటనే అధికారులు స్పందించి ఈ రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.