ఏజెన్సీ బందును విజయవంతం చేయాలి
జీవో 109 ప్రకారం కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 75% వాటా గిరిజనులు కేటాయించాలి
తుడుం దెబ్బ కార్యనిర్వాహక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పుర్కా బాబురావు
ఉట్నూర్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలలో ప్రభుత్వ జీవో 109 ప్రకారంగా 75% వాటా గిరిజనులు కల్పించాలని డిమాండ్ తో ఈనెల 19వ తేదీ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంత బంద్ పిలుపును విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పుర్కా బాపూరావు అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతా నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి ఉమ్మడి జిల్లా లోని ఏజెన్సీ బంద్ కు పిలుపు ఇచ్చామని అన్నారు. తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు
మైపతి అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో బందుకు పిలుపు విస్తున్నామని బాపురావు అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని 29 శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గిరిజనులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తుడుం దెబ్బ ఇచ్చిన బందు పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్ ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆయనతోపాటు తుడుం దెబ్బ జిల్లా శాఖ అధ్యక్షుడు పేందూరు దాదేరావు, తుడుం దెబ్బ నాయకులు పాల్గొన్నారు.






