18 August, 2026 | 7:02 PM

నరాల సాంబశివరెడ్డికి వందే భారత్ జాతీయ సమైక్యత అవార్డు

18-08-2026 06:26 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామానికి చెందిన నరాల సాంబశివరెడ్డికి వందే భారత్ జాతీయ సమైక్తా అవార్డును అందుకున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా  హైదరాబాద్  రవీంద్ర భారతిలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యముతో అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.

క్రీడారంగం తో పాటు కళా రంగంలో సేవ చేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు నరాల సాంబశివారెడ్డికి వందే భారత్ జాతీయ సమైక్యత అవార్డును ప్రముఖ సినీ దర్శకులు శ్రీ రేలంగి నరసింహ రావు, సరస్వతి ఉపసకులు దైవజ్ఞ శర్మ, వంశి ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కా వెంకటరమణ, సినీ నటులు జేన్నీ, ఏసిపి పింగళి నరేష్ రెడ్డి, సినీ దర్శకులు మల్లం రమేష్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.