15 June, 2026 | 2:05 PM

Breaking News

తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •  

అంకుసాపూర్‌లో రోడ్డు పనులు ప్రారంభం

12-02-2026 10:53 AM

తంగళ్ళపల్లి, (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం  కింద అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. గ్రామంలో కొబ్బరికాయ కొట్టి చేశారు. గ్రామంలోని చంద్రవంక మొదటి కాలువ నుండి గడ్డం అంజయ్య పొలం వరకు ఉన్న రహదారికి మొరం పోయే పనులను ప్రారంభించారు. ఈ పనుల ద్వారా గ్రామ ప్రజలకు రాకపోకల సౌకర్యం మెరుగుపడడంతో పాటు రైతులకు వ్యవసాయ కార్యకలాపాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే రహదారి సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారంగా మారుతుందని గ్రామస్తులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంచ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ రాజేశం, వార్డు సభ్యుడు సవనపల్లి బాలయ్య, క్యారం పరుశురాములు, తుమ్మల కనకయ్య, రేగుల శ్రీనివాస్, రోడ్ల మధు, కోడి కనకయ్య, గ్రామ సెక్రటరీ సంతోష్, ఫీల్డ్ అసిస్టెంట్ సామి తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి తమవంతు కృషి కొనసాగిస్తామని నాయకులు పేర్కొన్నారు.