23 May, 2026 | 8:29 PM

బ్రహ్మాజీ వాడిలో రోడ్లకు మరమ్మతులు

23-05-2026 07:43 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం  బ్రహ్మాజీ వాడి గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు శనివారం రోడ్లకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రధాన రోడ్లు గుంతల మయం కావడంతో వాటిపై నడవాలంటేనే ఇబ్బందికరంగా మారింది. తక్షణ మరమ్మతుల కోసం ఆ రోడ్లపై మొరం పోసి చదును చేయిస్తున్నారు. ఈ రోడ్లపై నడవడానికి, ద్విచక్ర వాహనాలపై వెళ్లడానికి సైతం ఇబ్బందిగా మారడంతో వెంటనే మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో అవసరమైన రోడ్లపై మొరాన్ని పోసి చదును చేయిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అంజనబాయిరఘుపతి మాట్లాడుతూ... గ్రామంలో రోడ్లు అద్వానంగా మారడంతోనే గ్రామపంచాయతీ నిధుల నుంచి ఈ అభివృద్ధి పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రవీందర్ రావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.