స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం
23-05-2026 08:24 PM
నంగునూరు,(విజయక్రాంతి): మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన గోపి వారం రోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న అతని పాఠశాల స్నేహితులు మానవత్వాన్ని చాటుకున్నారు. తమ వంతుగా కొంత నగదును పోగుచేసి, రూ.34,000 ఆర్థిక సహాయాన్ని శనివారం గోపి కుటుంబ సభ్యులు భార్య లలిత, ఇద్దరు కుమారులకు అందజేశారు. సహాయం అందజేసిన వారిలో గోపి స్నేహితులు రేపాక రవీందర్ రెడ్డి, రంగు రమేశ్,చామంతుల కనకరాజు,లింగం,బస్వారాజు, రాములు, గంగుల రవి,తాళ్లపల్లి శ్రీనివాస్, గోక రాంరెడ్డి,కృష్ణమూర్తి,ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.






