సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళం
23-05-2026 08:26 PM
నంగునూరు,(విజయక్రాంతి): నంగునూరు మండలం తిమ్మయిపల్లి,మధిర గ్రామమైన భాషాయిగూడెం లో సీసీ కెమెరాల ఏర్పాటుకు తిమ్మయిపల్లి గ్రామానికి చెందిన బెజగం నర్మద-రవీంద్రప్రసాద్ దంపతులు శనివారం రూ.రెండు లక్షల విరాళం అందజేశారు. గ్రామ సర్పంచ్ చేర్యాల రాజు,రాజగోపాల్‌పేట ఎస్సై వివేక్ మేరకు వారు ఈ ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చేర్యాల రాజు మాట్లాడుతూ..గ్రామాభివృద్ధికి భద్రత కోసం స్పందించి విరాళం అందించిన నర్మద-రవీంద్ర ప్రసాద్ లకు గ్రామ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కలకుంట్ల యాదగిరి,చల్లారం రమేష్ రెడ్డి, జింకల కృష్ణ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






