1 July, 2026 | 8:53 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

అంకుసాపూర్‌లో స్కూల్ వద్ద రోడ్ సేఫ్టీ బోర్డు ఏర్పాటు

17-04-2026 03:58 PM

– వాహనదారులకు గ్రామస్థుల విజ్ఞప్తి

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన చర్యలు చేపట్టారు. గ్రామ సర్పంచ్ అంచ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాల, అంకుసాపూర్ పాఠశాల ముందు స్కూల్ రోడ్డుపై రోడ్ సేఫ్టీ బోర్డు ఏర్పాటు చేశారు.

పాఠశాల సమీపంలో చిన్నారులు తరచుగా రాకపోకలు సాగించే నేపథ్యంలో, వాహనదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ముఖ్యంగా పాఠశాల పరిసర ప్రాంతాల్లో వాహనాలను మెల్లగా నడపడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు కలిసి ఈ చర్యను స్వాగతిస్తూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి విద్యార్థుల భద్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.