1 July, 2026 | 7:36 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •  

బీజేపీ నాయకులు బీఆర్ఎస్‌లోకి చేరిక

17-04-2026 03:55 PM

గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వాంకిడి మండలం ఎనోలి గ్రామానికి చెందిన సుమారు 20 మంది బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాంకిడి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు డాక్టర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో వారు ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి సమక్షంలో పార్టీలో చేరికయ్యారు.

ఎమ్మెల్యే కోవ లక్ష్మి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, కార్యకర్తలపై చూపుతున్న ఆప్యాయత, అభిమానానికి ఆకర్షితులై తాము బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆమె సూచించారు.