calender_icon.png 14 January, 2026 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజాగ్రత్త వద్దు.. ప్రాణం అమూల్యం!

14-01-2026 02:16:05 AM

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత : కందుకూరు సీఐ సీతారాం

కందుకూరు, జనవరి 13 (విజయక్రాంతి): ‘క్షణ కాలపు అజాగ్రత్త.. జీవిత కాలపు విషాదం‘ అని, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కందుకూరు సీఐ సీతారాం పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని కొత్తగూడ గ్రామ పంచాయతీలో గల ఒక ప్రముఖ మిర్చి ఫ్యాక్టరీలో కార్మికులకు మరియు యాజమాన్యానికి రోడ్డు భద్రతా నియమాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహన సదస్సులో సీఐ సీతారాం మాట్లాడుతూ.. పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా రోడ్డు నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండటం అత్యవసరమని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్ ధరించడం వల్ల 80 శాతం వరకు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని, కార్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపడం నేరమే కాకుండా, అది మీ కుటుంబానికి తీరని లోటును మిగిలిస్తుందని హెచ్చరించారు.

అతివేగం  త్వరగా చేరుకోవాలనే ఆత్రుతతో మితిమీరిన వేగంతో వెళ్లడం వల్ల నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరుగుతు న్నాయని, వేగాన్ని అదుపులో ఉంచుకోవాలని,మలుపుల వద్ద, కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరి వెనుక ఒక కుటుంబం ఎదురుచూస్తుంటుందని, ఇంటి నుండి బయటకు వచ్చిన వారు తిరిగి క్షేమంగా చేరుకోవడమే రోడ్డు భద్రతా వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని సీఐ తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా తమ కార్మికులు రోడ్డు నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, లోడింగ్ వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ నిర్వాహకులు, స్థానిక పోలీస్ సిబ్బంది మరియు వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు.