14-01-2026 02:14:41 AM
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్ జనవరి 13 (విజయ క్రాంతి): పండుగలు మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయం వద్ద అమీర్ పేట కు చెందిన బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాద వ్ కైట్ లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకు మారి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్ రెడ్డి, సురేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, రామ్ నివాస్ బన్సాల్, ఖలీల్, పీయూష్ గుప్తా, రాజేష్ ముదిరాజ్, గోపిలాల్ చౌహ న్, గులాబ్ సింగ్, కట్టా బలరాం, జమీర్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
పద్మారావు నగర్‌కు చెందిన బిఆర్‌ఎస్ నాయకుల ఆధ్వర్యంలో చేయించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు,నాయకులు మహేందర్ గౌడ్, శైలేందర్, ప్రేమ్, శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి,రాజేంద్రప్రసాద్, రవి, హరిచారి తదితరులు పాల్గొన్నారు.