calender_icon.png 14 January, 2026 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగవల్లులతో తెలుగు సంప్రదాయం ఉట్టిపడాలి

14-01-2026 02:16:31 AM

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

ముషీరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): మహిళలు తెలుగు సంప్రదాయం ఉట్టి పడేలా ముగ్గులు వేయడం సంతోషకరమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. స్వచ్చంద సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ మేర కు మంగళవారం కవాడిగూడ డివిజన్ లోని ఇందిరా పార్క్ రాక్ గార్డెన్స్ లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 107 వ జయంతి సందర్భంగా మర్రి కృష్ణారెడ్డి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో అప్స స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో కవాడిగూడలోని వివిధ బస్తీలోని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వ హించారు.

ఈ కార్యక్రమంలో మహిళలు వివిధ కళాకృతులు తెలుగు సాంప్రదాయ పద్ధతిలో రంగురంగుల ముగ్గులు నేటి సమాజంలో సంప్రదాయం గుర్తుచేసుకుం టూ సంక్రాంతి పండుగలో మహిళలు తమ ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సందర్శించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి సందర్శించారు.

అనంతరం ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలలకు, సామజిక కార్యకర్తలకు బహుమతులు దత్తాత్రేయ, మర్రి కృష్ణారెడ్డి చేతుల మీదుగా పంపిణీచేశారు. ఈ కార్యక్రమం లో కృష్ణ టెడ్డి, వసుధ, సుదర్శన్ రెడ్డి, హేమ మాలిని, జ్యోతి, అప్స సీనియర్ కో -ఆర్డినేటర్ బొట్టు రమేష్, రాజేశ్వరీ, శోభా రాణి లావణ్య, రింగు బుగ్గయ్య, వివిధ బస్తీల మహిళలు పాల్గొన్నారు.