26 March, 2026 | 11:20 PM

రోడ్డు పనుల ప్రారంభం

29-11-2025 03:10 PM

కాటారం (మల్హర్),(విజయక్రాంతి): తాడిచర్ల కాపురం గ్రామాల జెన్కో భూనిర్వసిత హక్కుల సాధన పోరాట కమిటీ, గ్రామ రైతులు గతంలో చేసిన అభ్యర్థన మేరకు ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు సిఎస్ఆర్ నిధుల ద్వారా కోమటికుంట నుండి ఎర్రగుంట వరకు రోడ్డు పనులను ప్రారంభించారు. కోమటికుంట ఆయకట్టు రైతులతో కలిసి ఏఎమ్మార్ ప్రతినిధులు ఎస్ఓ సురేష్ బాబు, ల్యాండ్ ఆక్వేషన్ ఆఫీసర్ రామచంద్రమూర్తి పర్యవేక్షించారు. శనివారం ఏఎమ్మార్  ఉద్యోగులు, వర్క్ ఇన్స్పెక్టర్ సదానందం , సిఎస్ఆర్ సూపర్వైజర్ బొబ్బిలి నరేష్, నారమల్ల నరేష్ ,ఇందారపు రజాక్, ఆధ్వర్యంలో రోడ్డు పనులను ప్రారంభించారు.