16 July, 2026 | 10:58 AM

కిరాయి ఇంటికే కన్నం.. ఓనర్ ఇంట్లోనే చోరీ

07-06-2024 12:55 AM

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 6 (విజయక్రాంతి) :అద్దెకు ఉన్న ఇంటికి కన్నం వేసి సుమారు 117 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించిన మహావీర్ అనే వ్యక్తి గురువారం 2వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన వివరాలను సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం 2వ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిదిలోని ఎస్‌సిబి నగర్‌లో నివాసం ఉంటున్న మనోహార్‌బాబు ఇంట్లో గత ఏడాది ఫిబ్రవరి  నెలలో చోరి జరిగింది. మనోహార్ బాబు ఇంటిపై పోర్షన్‌లో మహావీర్ అనే వ్యక్తి  గత నాలు గు సంవత్సరాలుగా కుటుంభంతో కిరాయికి ఉంటున్నారు.  ఇంటి యజ మానికి ఉన్న  ఇద్దరు కుమారుల్లో ఒకరు అమెరికాలో, మరోకరు బెంగ్లూరులో నివాసం ఉంటున్నారు. ఆ ఇంట్లో ఇద్దరు వృద్ద దంపతులు మాత్రమే ఉంటున్నారు.

దీంతో కిరాయికి ఉన్న మహావీర్ వారితో సన్నిహింగా ఉం టూ వారికి అనుమానం రాకుండా ఇంటితాళ్లకు చెందని రెండో తాళంచెవిని దొంగిలిస్తా డు. దంపతులు ప్రతిరోజు దేవాలయానికి వెళ్తుంటారు. అదునుచూసి వారు దేవాలయానికి వెళ్లిన సమయంలో బీరువాలో ఉన్న  రూ 7.60 లక్షల విలువ గల 117 గ్రా ముల బంగారు ఆభరణాలు నక్లెస్, చైను, నాలుగు గాజులు అపహరిస్తాడు. మనోహార్ బావు అత్యవసర పనిమీద అమెరికా వెళుతూ ఇంట్లోని నగలు కన్పించక పోవడంతో దొంగతనం జరిగినట్లు తెలుసుకొన్నారు. 

సమయం కుదరక వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేక పోవడంతో అతని మిత్రుడి సహాయంతో ఫిర్యాదు చేశా రు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మనోహర్‌బాబు అమెరికా నుంచి వచ్చిన తర్వాత వివరాలు సేకరించారు. ముమ్మరగా దర్యాప్తు ప్రారంభించగా  గురువారం దొంగిలించిన వస్తువు ను మహావీర్ అమ్మడానికి తీసుకెళ్తున్న క్రమం లో గోదుమవాగు వద్ద పోలీసులు పట్టుకొని విచారించగా దొంగతనం చేసింది తనే అని అంగీకరించాడు. అతని నుంచి బం గారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకొని అరె స్టు చేసి కోర్టులో హాజరు పర్చామన్నారు.