15 May, 2026 | 10:15 PM

Breaking News

పట్టపగలే రెచ్చిపోయిన దోపిడీ దొంగలు

21-06-2024 12:10 AM

బుర్కాతో వచ్చి కత్తితో దాడి

నగదు, నగలతో పరారైన దుండగులు

మేడ్చల్‌లోని నగల షాపులో ఘటన

మేడ్చల్, జూన్ 20 (విజయక్రాంతి): నగర శివారులో దోపిడీ దొంగలు పట్టపగలే కత్తితో బెదిరించి, నగదు, నగలతో పారిపోయారు. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని ప్రధాన రహదారిలో శేషారాం అనే వ్యక్తి జగదాంబ జ్యువెల్లర్స్ నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు షాపు ముందు ఆగారు. ఒకరు బుర్కా ధరించగా, మరొకరు హెల్మెట్ ధరించి దుకాణం లోపలికి ప్రవేశించి శేషారాంపై కత్తితో దాడి చేశారు. నగలు, నగదు ఇవ్వాలని బెదిరించారు. ప్రతిఘటించిన శేషారాం వారిని షాపులోనే ఉంచి షటర్ వేసేందుకు బయటకు వస్తుండగా దొంగలు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అదే సయంలో షాపు లోపలి భాగంలో ఉన్న యజమాని కుమారుడు సురేష్ దొంగలను పట్టుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. దుండగుల మీదకు కుర్చీ విసరగా గాయమైనట్లు తెలుపుతున్నారు. దొంగలు కొంత నగదు, నగలు దోచుకెళ్లినట్లు బాధితులు చెప్పారు.