15 May, 2026 | 9:16 PM

Breaking News

ప్రైవేటు స్కూళ్ల బస్సులు మా ఊరికి రావొద్దు!

21-06-2024 12:10 AM

పెగ్గెర్ల గ్రామ ప్రజల తీర్మానం

జగిత్యాల, జూన్ 20 (విజయక్రాంతి): ‘మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పం పిస్తాం.. ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన బస్సులు మా గ్రామాల్లో ప్రవేశించేందుకు మేం అంగీకరించం’ అని జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామస్తులు తీర్మా నించారు. ఈ మేరకు గురువారం ఉదయం కోరుట్ల, రుద్రంగి, మెట్‌పల్లి పట్టణాల నుంచి వచ్చిన అనేక ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను మహిళలు అడ్డుకున్నారు. గ్రా మం నుంచి వెనక్కి పంపించేశారు. తమ గ్రామానికి చెందిన పిల్లలందరూ పదో తరగతి గ్రామంలోని సర్కార్ బడిలోనే చదు వుతారని, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తమ గ్రామానికి బస్సులు పం పించొద్దని హెచ్చరించారు. మరోవైపు పిల్లలను పంపించకపోతే ప్రైవేటు స్కూళ్ల  మను గడ ఎలా ఉంటుందని.. యాజమాన్యాలు గ్రామపెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది.