calender_icon.png 10 February, 2026 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణిలో దోపిడీ

10-02-2026 01:45:10 AM

నాడు బీఆర్‌ఎస్, నేడు కాంగ్రెస్ దందా

  1. సంస్థను కాపాడేది బీజేపీనే 
  2. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బీజేపీ మధ్యే పోటీ 
  3. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 
  4. రామగుండం, సుల్తానాబాద్, మంచిర్యాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం 

పెద్దపల్లి/గోదావరిఖని/మంచిర్యాల/సుల్తానాబాద్, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి): సింగరేణి సంస్థను నాడు బీఆర్‌ఎస్ పార్టీ, నేడు కాంగ్రెస్ పార్టీలు దోచు కున్నాయని, సింగరేణి సంస్థను కాపాడేది బీజేపీ మాత్రమేనని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, సుల్తానాబాద్, మంచిర్యాలలో పర్యటించారు.

ఆయా సభల్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు సింగరేణిని అప్పుల పాలు చేశాయని, సింగరేణి ప్రాంతానికి అన్యాయం చేశాయన్నారు. సింగరేణిలో కేంద్ర ప్రభు త్వ వాటా ఉన్నా తమ ప్రమేయం లేకుం డా  ఏక పక్ష నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని అప్పులపాలు చేసిందని అన్నారు. రామగుండం ప్రాంత అభివృద్ధి కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిం దేమీ లేదని, రామగుండంలో ఎరువుల క ర్మాగారం, తెలంగాణ పవర్ ప్రాజెక్టు తె చ్చింది ప్రధాని నరేంద్రమోదీ అని గుర్తుచేశారు.

తెచ్చిన కర్మాగారాల మీద పడి కాం గ్రెస్, బీఆర్‌ఎస్  స్థానిక నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. రామగుం డం ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ణప్తి చేశారు. బీజేపీని గెలిపిస్తే మరింత అభివృద్ధి చెందు తుందన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిన కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా  చేసుకున్నారన్నా రు. తెలంగాణలో కారు పంచర్ అయిందని, కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారని, కేసీఆర్ ఏం చేశాడని బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఆయన బిడ్డ కవితనే అంటున్నారని ఎద్దేవా చేశారు.

సింగరేణికి రావాల్సిన రూ.51 వేల కోట్లను సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. సింగరేణి డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎవడబ్బ సొమ్మని ఖర్చు చేసుకున్నదని ప్రశ్నించారు. సింగరేణిలో కార్మికుల సౌకర్యార్థం కొత్త క్వార్టర్స్ కట్టడం లేదని, ఉన్న క్వార్టర్స్ ను మరమ్మతులు చేయించడం లేదన్నారు. మరోవైపు అవినీతిపరులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగరేణి భూములను కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మరోసారి మనల్ని మనమే మోసం చేసుకున్నవారమవుతామని, కాంగ్రెస్ పార్టీ అంటేనే కమీషన్, కరప్షన్, మోసం అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌రెడ్డికి పోయే కాలం వచ్చిందని, కాంగ్రెస్ ఇచ్చిన ఏఒక్క హామీ అమలు చేయలేదన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఆదరించాలని కోరారు.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని, కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లేదని కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యం, గ్రామీణ ప్రాంతాలకు వేస్తున్న రోడ్లకు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నారు. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నస్పూర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ గెల్లు రజిత మల్లేశం బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బీజేపీ అధికార ప్రతినిధి, సుల్తానాబాద్ మున్సిపల్ ఇంచార్జ్ రాణి రుద్రమదేవి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, నాయకులు మీసా అర్జునురావు, నల్ల మనోహర్‌రెడ్డి, గుర్రాల మల్లేశం, గొట్టే ముక్కల సురేష్‌రెడ్డి, కడారి అశోక్‌రావు, సౌదరి మహేందర్ యాదవ్, కందుల శ్రీనివాస్ పాల్గొన్నారు. మంచిర్యాలలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ రావు, బీజేపీ జాతీయ కార్యదర్శి గుమాస శ్రీనివాస్, ఎన్నికల ఇంచార్జి ప్రేమేందర్, మేయర్ అభ్యర్థి గాజుల ముఖేష్ గౌడ్, మండల అధ్యక్షుడు సత్రం రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు తులా ఆంజనేయులు, గుడారపు కృష్ణమూర్తి, అభ్యర్థులు పాల్గొన్నారు.