10-02-2026 01:46:00 AM
ఇందారంలో కార్మికుల ఆందోళన
మంచిర్యాల, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇం దారం ఐకే 1 ఓపెన్ కాస్ట్ గనిలో వారాహి కంపెనీ కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం ఆందోళన నిర్వహించారు. వారికి రావలసిన నెల జీతంతో పాటు బోనస్ ఇవ్వకుండా చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓసి నుంచి రాత్రికి రాత్రి మెషిన్లు తరలిస్తున్నారని డ్రైవర్లు, క్యాంపు సిబ్బంది ఆరోపించారు.
వా రాహీ కంపెనీ భాగస్వాముల మధ్య సఖ్యత లోపించి, ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఒప్పందం ప్రకారం నిర్దేశించిన బొగ్గు, మట్టి పనుల లక్ష్యాలు పూర్తి చేయడం లేదని సింగరేణి అధికారులు ఇప్పటికే కంపెనీకి జరిమా నా విధించారని, దీనిని నష్టంగా చూపించి పనిచేసిన కార్మికులను నష్టపరచడం అన్యా యం అన్నారు.