calender_icon.png 22 December, 2025 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఎంపీఐఎస్‌లో రోబోటిక్స్ ఎక్స్‌పో

22-12-2025 12:00:00 AM

ప్రారంభించిన పాఠశాల చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 21(విజయక్రాంతి): హైదర్షాకోట్ లోని ఎస్‌ఎంపీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో రోబోటిక్స్ ఎక్స్‌పో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఎక్స్‌పోను పాఠశాల చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. చిన్న వయసు నుంచే సాంకేతిక పరిజ్ఞానంపై ఆస క్తి పెంచుకొని, సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు వెతకాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ విద్యార్థులు తమ ప్రాజెక్టులను సందర్శకులకు స్వయంగా వివరించడం ద్వారా తమ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. 5వ తరగతి విద్యార్థులు జయసూర్య, నమన్‌శర్మ తమ రోబో లైట్ 2.0 మోడల్‌ను ప్రదర్శిస్తూ, రోబోటిక్స్, ఆటోమేషన్ ప్రాథమిక అంశాలను ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు.

8వ తరగతి విద్యార్థు లు అమతుల్ హసీబ్, అఫ్షీన్ తమ గెస్ట్ కౌం టర్ ప్రాజెక్టును వివరించారు. ఈ ప్రాజెక్ట్ మాల్స్, ఇతర ప్రజా ప్రదేశాల్లో సందర్శకుల సంఖ్యను లెక్కించే స్మార్ట్ సిస్టమ్‌గా రూపొందించబడింది అని చెప్పారు. ఈ కార్యక్రమా నికి పాఠశాల ప్రిన్సిపాల్ జేసుదాస్‌తో పా టు డైరెక్టర్లు శ్వేతారెడ్డి, దివ్యారెడ్డి, భవ్యారెడ్డి, వంశీప్రియ హాజరయ్యారు. వారు విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ, భవిష్యత్‌లో కొత్త సాంకేతికతలను మరింతగా అన్వేషించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.