21-12-2025 10:53:39 PM
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటైన ఏఎస్బీఎల్ తమ ఉద్యోగులు, కస్టమర్ల కోసం ఫ్యామిలీ డే 2025ను ఘనంగా నిర్వహించింది. కమ్యూనిటీ, కనెక్షన్, భాగస్వామ్య విజయానికి అంకితమైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ప్రముఖ యాంకర్ సుమ కనకాల తన వ్యాఖ్యానంతో ఈ ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ కు మరింత జోష్ తెచ్చారు. కస్టమర్‌లతో అనుబంధం లావాదేవీలకే పరిమితం కాకుండా అంతకుమించిన రిలేషన్ తో కొనసాగాలన్న ఉద్దేశంతోనే దీనిని నిర్వహించినట్టు ఏఎస్బీఎల్ వ్యవస్థాపకుడు, సీఈఓ అజితేష్ కొరుపోలు చెప్పారు.
కుటుంబాలను ఒకే చోటకు తీసుకురావటం ద్వారా ,నమ్మకం, అనుసంధానిత, భాగస్వామ్య విలువలతో సమాజాన్ని నిర్మించాలనే తమ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శాస్త్రీయ నృత్య ప్రదర్శన, రామాయణ స్కిట్, మ్యూజికల్ ఓపెన్ మైక్ , డీజే నైట్ వంటిని అందరినీ అలరించాయి. మౌలిక సదుపాయాల కేంద్రంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందడం వంటి పరిణామాలపైనా సీఈవో అజితేష్ కొరుపోలు మాట్లాడారు. భారతదేశంలో అతిపెద్ద టెక్ ఉపాధి కేంద్రంగా నగరాన్ని గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు , డేటా సెంటర్ పెట్టుబడులకు కీలక గమ్యస్థానంగా మార్చాయన్నారు.