21-12-2025 11:00:16 PM
ముద్దులొలికే చిన్నారుల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లిటిల్ మిస్ & మిస్టర్ సౌత్ ఇండియా బ్యూటీ పెగెంట్ కర్టెన్ రైజర్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ది లుక్స్ మోడలింగ్ , యాక్టింగ్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ పోటీల్లో, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతికి చెందిన చిన్నారులు పాల్గొంటున్నారు. విశ్వాసం, వ్యక్తిత్వ అభివృద్ధి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ప్రోత్సహించడానికి దీనిని నిర్వహిస్తున్నారు.
లిటిల్ మిస్ & మిస్టర్ సౌత్ ఇండియా బ్యూటీ పెగెంట్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 27న హైదరాబాద్ యూసఫ్ గూడా చెక్ పోస్ట్ దగ్గరున్న శౌర్య కన్వెన్షన్ హాల్ లో జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను ది లుక్స్ వ్యవస్థాపకుడు, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ మండ, యాంకర్ యాంకర్ రవి ఆవిష్కరించారు. లిటిల్ మిస్ & మిస్టర్ సౌత్ ఇండియా కేవలం అందం గురించి మాత్రమే కాదనీ, పిల్లలలో విశ్వాసం, క్రమశిక్షణ, సృజనాత్మకత , సంపూర్ణ వ్యక్తిత్వ అభివృద్ధిని పెంపొందించడం గురించే పోటీలు నిర్వహిస్తున్నట్టు కౌశల్ మండ చెప్పారు. 3-6, 7-10, 11-14, 15-19 సంవత్సరాల బాలికలు, బాలురు విభాగాల్లో పోటీలు జరుగుతాయని వివరించారు. సర్టిఫైడ్ గ్రూమింగ్ సెషన్స్ , టాలెంట్ రౌండ్స్, గ్రాండ్ ఫినాలే రాంప్ వాక్ ఉంటుందన్నారు.