12 June, 2026 | 9:50 PM

గాలి దుమారానికి చెట్టు ఎక్కిన రేకులు

12-06-2026 09:19 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రంలో గురువారం సాయంత్రం వీచిన గాలి దుమారం వర్షానికి మండల కేంద్రంలోని కల్మలచేరువు రోడ్డులో ఎస్సీ కాలనీకి చెందిన బొజ్జ ఉప్పలయ్య ఇంటి రేకులు ఎగిరిపోయి వేప చెట్టుపై వాలాయి. అనంతరం కురిసిన వర్షం, గాలి దుమారానికి జనం బయటికి రావడం రాకపోవడంతో ప్రమాదం తప్పింది. రాత్రి మొత్తం ఆ రేకులు ఎక్కడ  కింద పడి ఎవరికి ఏ ప్రమాదం అవుతుందోనని బొజ్జ ఉప్పలయ్య కంటికి కునుకు లేకుండా రాత్రంతా కాపలా కాయాల్సి వచ్చిందని తెలిపాడు. రేకుల కప్పు కురవడంతో అందులో ఉండే ఉప్పలయ్య తన కుమారుడు తో కలిసి వేరే ఇంటికి వెళ్లడం ప్రాణాప్రాయం తప్పిందన్నాడు. మర్నాడు శుక్రవారం ఉదయం గ్రామస్తుల సాయంతో ఆ రేకులను చెట్టుపై నుండి కిందికి దించినట్టు తెలిపారు. గాలి దుమారం తో నీడను కోల్పోయిన తనకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయాలని కోరారు.